అందరికీ నమస్కారం, సీఐఎస్-ఎ2కె నిర్వహించనున్న ట్రైన్-ద-ట్రైనర్ (టిటిటి) 2017 కార్యక్రమం 20-22 ఫిబ్రవరి 2017 తేదీల్లో జరగనుంది.
*టిటిటి అంటే ఏమిటి?* ట్రైన్-ద-ట్రైనర్ లేదా టిటిటి అనేది రెసిడెన్షియల్ ట్రైనింగ్ కార్యక్రమం. కార్యక్రమం భారతీయ వికీమీడియా సముదాయ సభ్యుల్లో నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. గతంలో 2013, 2015, 2016 సంవత్సరాల్లో టిటిటి నిర్వహణ జరిగింది.
*ఎవరు పాల్గొనవచ్చు?* ఏదైనా భారతీయ భాషా వికీమీడియా ప్రాజెక్టులో కృషిచేస్తున్న ఏ చురుకైన వికీమీడియన్ అయినా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వాడుకరి కనీసం 500+ దిద్దుబాట్లు చేసినవారై వుండాలి. గత టిటిటిల్లో పాల్గొన్న వారు ఎవరైనా దరఖాస్తు చేసుకునే వీలు లేదు.
ఈ కార్యక్రమం గురించి మరిన్ని వివరాలు ఈ కింది లింకులో చూసి, పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకోవడం కానీ, మీ సముదాయం నుంచి అర్హులైన వాడుకరులను పాల్గొనేలా ప్రోత్సహించడం కానీ చేయగలరు: https://meta.wikimedia.org/wiki/CIS-A2K/Events/Train_the_ Trainer_Program/2017
మీకు ఏమైనా ప్రశ్నలు మిగిలివుంటే, దయచేసి మాకు తెలియజేయండి. ధన్యవాదాలు, పవన్ సంతోష్.