ఇప్పుడు వికిపీడియాలో తెలుగు రాయటానికి, వ్యాసాలు దిద్దటానికి బయటి పరికరాలేవీ
ఉపయోగించకుండా ఎడిట్ బాక్సులోనే తెలుగు టైపు చెయ్యగలిగే పరికరమొచ్చింది. ఏదైనా
వ్యాసము ఎడిట్ చేస్తున్నప్పుడు ఎడిట్ బాక్సు టూల్ బార్ కింద ఒక చెక్ బాక్స్
ఉంటుంది. దాని మీద టిక్ పెడితే ఇక ఎంచక్క ఎడిట్ బాక్సులోనే తెలుగు నేరుగా టైపు
చెయ్యొచ్చు.
దీన్ని విలైనంతగా RTS లిప్యాంతరీకరణ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దా. కానీ
ఇంకా ఇది పరిపూర్ణమవలేదు. ఏవైనా సమస్యలు కానీ, మెరుగు పరచు ఆలోచనలు కానీ ఉంటే
తెలియజేయగలరు