అందరికీ నమస్కారం,
సీఐఎస్-ఎ2కె నిర్వహించనున్న ట్రైన్-ద-ట్రైనర్ (టిటిటి) 2017 కార్యక్రమం 20-22
ఫిబ్రవరి 2017 తేదీల్లో జరగనుంది.
*టిటిటి అంటే ఏమిటి?*
ట్రైన్-ద-ట్రైనర్ లేదా టిటిటి అనేది రెసిడెన్షియల్ ట్రైనింగ్ కార్యక్రమం.
కార్యక్రమం భారతీయ వికీమీడియా సముదాయ సభ్యుల్లో నాయకత్వ లక్షణాలు అభివృద్ధి
చేయడానికి ప్రయత్నం చేస్తుంది. గతంలో 2013, 2015, 2016 సంవత్సరాల్లో టిటిటి
నిర్వహణ జరిగింది.
*ఎవరు పాల్గొనవచ్చు?*
ఏదైనా భారతీయ భాషా వికీమీడియా ప్రాజెక్టులో కృషిచేస్తున్న ఏ చురుకైన
వికీమీడియన్ అయినా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వాడుకరి కనీసం 500+ దిద్దుబాట్లు చేసినవారై వుండాలి.
గత టిటిటిల్లో పాల్గొన్న వారు ఎవరైనా దరఖాస్తు చేసుకునే వీలు లేదు.
ఈ కార్యక్రమం గురించి మరిన్ని వివరాలు ఈ కింది లింకులో చూసి, పాల్గొనేందుకు
దరఖాస్తు చేసుకోవడం కానీ, మీ సముదాయం నుంచి అర్హులైన వాడుకరులను పాల్గొనేలా
ప్రోత్సహించడం కానీ చేయగలరు:
https://meta.wikimedia.org/wiki/CIS-A2K/Events/Train_the_
Trainer_Program/2017
మీకు ఏమైనా ప్రశ్నలు మిగిలివుంటే, దయచేసి మాకు తెలియజేయండి.
ధన్యవాదాలు,
పవన్ సంతోష్.