అందరికీ నమస్కారం. తెలుగు వికీపీడియా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ రెండవ ఆదివారం (13.12.2015) నాడు హైదరాబాదుకు చెందిన తెవికీపీడియన్లు, ఇతర ఔత్సాహికులతో.. డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి రాష్ట్ర మ్యూజియంలో మరియు పబ్లిక్ గార్డెన్ లోపల బయట ఉన్న విగ్రహాల, చారిత్రాత్మక నిర్మాణాల ఫోటో హంట్ (ఫోటోలు తీసి కామన్స్ లోకి ఎక్కించే) కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇతర ప్రాంతాలలో ఉన్న తెలుగు వికీపీడియన్లు కూడా ఇందులో పాల్గొని.. మీమీ ప్రాంతంలో ఉన్న చారిత్రిక ఛాయాచిత్రాలను కామన్స్ లోకి ఎక్కించగలరు. కార్యక్రమ పేజీ కొరకు ఇక్కడ https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%B6%E0%B0%82/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE_%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B0%B5%E0%B0%82_2015_-_%E0%B0%A4%E0%B1%86%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B0%BF_%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95_%E0%B0%9B%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BE%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81 చూడగలరు. హైదరాబాద్ లోని తెవికీపీడియన్లు పైన ఇచ్చిన పేజీలో ఆసక్తి, వీలు కుదిరినమేరకు నమోదుచేసుకుని పాల్గొనవలసిందిగా మనవి. అలాగే మీకు తెలిసిన చరిత్ర ఔత్సాహికులు, సంస్కృతి అభిలాషులు, ఇతర ఉత్సాహవంతులను కూడా తీసుకురావచ్చు. వారిని తీసుకురావడానికి ముందుగా వికీలో ఖాతా తెరిపిస్తే కొంత వీలుగా ఉంటుంది. ఇతర వివరాల కొరకు కార్యక్రమ నిర్వాహకులు, తెవికీపీడియన్, థియేటర్ స్కాలర్ ప్రణయ్ రాజ్ వంగరిని కానీ, నన్ను కానీ సంప్రదించగలరు. ఇట్లు, పవన్ సంతోష్, +91.9640656411.