తెలుగు బ్లాగరుకు, అభిమానులకు , ఆర్యా ,
ప్రతి సంవత్సరం లాగానే e-తెలుగు తరఫున ఒక స్టాలును నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మామూలు రోజుల్లో మద్యాహ్నం 2 నుండి రాత్రి 8 గంటల వరకు శని, ఆది వారాలలో మద్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకు స్టాలు తెరచి ఉంటుంది. వేలలో ఉన్న తెలుగు బ్లాగుల సందర్శకులని లక్షల్లోనికి పెంచే దిశగా ఈ పుస్తక ప్రదర్శలలో మన కార్యక్రమాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయని ఆశిస్తున్నాం. ఎందుకంటే, పుస్తక ప్రదర్శనకి వచ్చేవారిలో చదివే ఆసక్తి ఉన్నవాళ్ళు ఎక్కవ శాతం ఉంటారు . తెలుగు గురించి పదిమందికీ తెలియజేయడానికీ, కంప్యూటర్లలో మరియు జాలంలో తెలుగు గురించిన సందేహాలూ సమస్యలు ఉన్నవారికి తోడ్పడటానికి ఇది మంచి అవకాశం
మన స్టాలు లో మీ బ్లాగు తెరపట్టు ప్రదర్శించ వచ్చు అందుకుగాను ఒక A 4 సైజు కాగితం మీద కలరు ప్రింటు తీసుకోని డిసెంబర్ 14 న e-తెలుగు ఒక స్టాలు నెంబరు 2 వద్ద మద్యాహ్నం 2 నుండి రాత్రి 8 గంటల మద్యలో అందచేయవచ్చు
పుస్తక ప్రదర్శనలో ఈ-తెలుగు స్టాల్ లో ఉండి ఈ-తెలుగు, కంప్యూటర్ లో తెలుగు వాడకం,తెలుగు వికీపీడియా, మరీ ముఖ్యంగా అంతర్జాలం లోని సాంఘికజాలనెలవులలో(సోషల్ నెట్వర్కింగ్ సైట్స్) తెలుగు ఉపయోగం వంటివి ప్రదర్శనకు వచ్చే వారికి వివరించేందుకు విజయవంతంగా నడుపుటకు చాలా మంది వాలంటీర్ల అవసరం ఉంది. తెలుగు స్టాల్ లో , కరపత్రములు , తెలుగు సాంకేతిక తెలుగు సాంకేతిక వనరులు లను ఉచితముగా ఇవ్వబడును తెలుగు నిర్వాహక వ్యవస్థ ( OS)తెలుగు ఫైరుఫాక్సు , తెలుగు ఖతులు తెలుగు టైపింగు సాధనాలు , వీడియోలు మరి కొన్ని తెలుగు ఉచిత ఉపకరణాలు సందర్సకుల పెన్ డ్రైవ్ లో ఉచితముగా ఇవ్వబడును , లేదా వారి ఖాళీ డి .వి .డి లో ఇవ్వబడును
తెలుగు బ్లాగరులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సహాయ సహకారాలను అందించాలని కోరుకుంటున్నాము . మీ సూచనలు సలహాలు అహ్వానిస్తున్నాము , క్రింది వివరాలను ఇ-మెయిలు ద్వారా గాని టెలిఫోను ద్వారా గాని తెలియపరచమని కోరుతున్నాము.
తెలుగు వాడకం పెరగాలని ఆశిస్తూ మన అవసరాలు ౧) తెలుగు బాటకు వచ్చిన వారికి పేరు సమోదు , వచ్చిన వారికి సహాయము చేయుట , కరపత్రముల పంపిణి మెదలగు అవసరములకు సహాయము కావలెను ౨) తెలుగు సాంకేతికాలు ( తెలుగు రాయటం , బ్లాగులు .. ) వాటికి సహాయము - వీరు లాపుటాపు తెచ్చుకొనవలసి ఉండును, ఇంటర్నెట్ సౌకార్యం ఉంటె మరి మంచిది. * * *పేరు:* *టెలిఫోను నంబరు:* *ఇమెయిలు చిరునామా:* *ఏ తేదీలలో ఏ సమయంలో స్టాలులో ఉండగలరో ఆ వివరాలు:*
మీ అందరి సహాయ సహకారాలను ఆకాంక్షిస్తూ ,అన్ని రోజులూ ఒక్కరే ఉండలేరు కాబట్టి ఒక్కో రోజూ ఒక్కొక్కరూ వంతుల వారీగా చెయాల్సిరావచ్చు. మీకూ ఏయే రోజులలో వీలవుందో చెప్తూ ఇక్కడ స్పందించండి. (దీనికోసం ఓ పూట మీ కార్యాలయం నుండి సెలవు తీసుకునే దిశగా కూడా ఆలోచించండి.)
మీ సహాయం మరియు తోడ్పాటు మాకు ఇప్పుడు అత్యంత ఆవశ్యకం. మీ నుండి సానుకూల స్పందనని ఆశిస్తూ...
మీ శ్రేయోభిలాషి కశ్యప్ 9396533666 kaburlu.wordpress.com