నమస్కారం
తెలుగు వికీపీడియా డిసెంబర్ 10, 2013న పది వసంతాలు పూర్తి చేసుకున్నదని అందరికీ విదితమే. ఈ సందర్భంగా ప్రపంచ నలుమూలలా ఉన్న తెలుగు వికీపీడియనులను ఒక వేదిక మీదకు తెచ్చి సత్కరించాలనే సంకల్పంతో తెలుగు వికీపీడియా క్రియాశీల సభ్యులు, వికీమీడియా భారతదేశ చాప్టర్, తెలుగు వికీపీడియా విశేష అభివృద్ధి జట్టు మరియు సీఐఎస్-ఏ2కే సంయుక్తంగా దశాబ్ది వేడుకలను విజయవాడలో నిర్వహించనున్నారు https://te.wikipedia.org/wiki/WP:Tewiki10. ఈ వేడుకలు 2014 ఫిబ్రవరి 15 మరియు 16 తేదీలలో విజయవాడలోని కేబీయన్ కళాశాల ప్రాంగణంలో జరుగనున్నాయి. అందరికీ ఇదే మా ఆహ్వానం https://te.wikipedia.org/wiki/WP:Tewiki10. మీ రాకను తెలియజేస్తూ, మీ ప్రయాణ వివరాలు, మీరుండే నిడివి తెలిపితే కార్యవర్గం వారికి సహాయకంగా ఉంటుంది. అందువలన https://docs.google.com/forms/d/15IBuc1-mAT1D8xDuBAaU4g6NueTKW7709nhbQsMjyzg... గల ఫారంను తప్పనిసరిగా నింపి అందించగలరు.
ఇట్లు కార్యవర్గం, తెవికీ దశాబ్ది ఉత్సవాలు
*https://te.wikipedia.org/wiki/WP:Tewiki10 https://te.wikipedia.org/wiki/WP:Tewiki10రహ్మానుద్దీన్ షేక్* నాని
[image: File:Wikimedia India logo.svg] http://wiki.wikimedia.in/ reachout
ఒక విశ్వాన్ని ఊహించండి, ఎక్కడయితే ప్రతి మనిషి ఒక సంపూర్ణ విజ్ఞానభాండారాన్ని అందరితో పంచుకోగలడో, ఆ విశ్వాన్ని ఊహించండి. *అటువంటి విశ్వాన్ని నెలకొల్పడమే మా సంకల్పం.* తెలుగు వికీపీడియా : http://te.wikipedia.org A new address for ebooks : http://kinige.com *తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com http://techsetu.com/*