నమస్కారం.
గత ఫిబ్రవరి నుండి CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం తెవికీ అభివృధ్ధికై కృషి చేస్తున్న సంగతి మీకందరికీ తెలిసిందే. గత సంవత్సరం 5 భారతీయభాషా వికీపీడీయాల అభివృధ్ధికి కృషి చేసిన CIS-A2K ఈ సంవత్సరం 7 భాషలలో కృషి చేయడానికి ప్రణాళిక తయారుచేస్తున్నది. ఈ 7 భాషలలో తెలుగును మళ్ళీ చేర్చడం జరిగిండి. రానున్న జులై 2014 నుండి జూన్2015 వరకు తెలుగు వికీ అభివృధ్ధికి ప్రణాళిక ఇక్కడ [1] చేర్చడం జరిగింది. సమాయాభావం వలన మొత్తం ప్రణాళికను తెలుగులోకి అనువాదం చేయడానికి వీలుపడలేదు. సభ్యులు సద్మనస్సుతో క్షమించగలరు మరియు అనువాదనికి తోడ్పడగలరు. ఈ ప్రణాళిక తెవికీ దశాబ్ది వేడుకలలో మరియు మార్చి 8వ తేది గోల్డెన్ త్రెషోల్డ్లో తెవికీ సభ్యుల మధ్య జరిగిన చర్చల అధారంగా, తెవికీ సభ్యుల సూచనలు సలహాలు పరిగణలోనికి తీసుకొని రూపొందించబడింది. ఈ ప్రణాళికను మెరుగు పరచడానికి సూచనలు సలహాలు చర్చా పేజిలో ఇక్కడ [2] ఇవ్వగలరు.

ప్రణాళికలో భాగంగా గత సంవత్సరం తెవికీలో మరియు క్రిందటి ఏడాది ప్రణాళికపరంగా జరిగిన ప్రగతి విశ్లేషణ కూడా జరుపబడింది.

CIS-A2K చేపట్టబోయే మిగతా 6 భాషల ప్రణాళికలు, మరియు ఇతర స్వతంత్ర ప్రాజెక్టులు,community strengthening initiatives ఇతరత్రా ప్రణాళికల ప్రగతి CIS-A2K Draft Work Plan పేజిలో చూడవచ్చు [౩]. ఈ ప్రణాళికలపై కూడా మీ సూచనలు సలహాలు నిర్ధారిత ప్రణాళికా చర్చా పేజిలో ఇవ్వ మనవి. నెనర్లు. అన్ని భాషా మరియు ప్రాజెక్టు ప్రణాళికలు సమగ్రంగా తయారైన తరువాత మళ్ళీ మెయిల్ చేయడం జరుగుతుంది.

ఇట్లు,
విష్ణు (CIS-A2K)
[1] http://bit.ly/1pkYger
[2] http://bit.ly/1gT7LB0
[3] https://meta.wikimedia.org/wiki/India_Access_To_Knowledge/Draft_Work_plan_July_2014_-_June_2015