నిన్ననే 30 వేల వ్యాసాలు అన్నారు అప్పుడే 50 వేలేమిటి అని చూస్తున్నారా.  నిన్న చెప్పింది "వ్యాసాల" సంఖ్య గురించి,  ఇవాళ "పేజీల" సంఖ్య గురించి చెబుతున్నాను.

ఈ రెండిటికీ తేడా ఏమిటి?
వ్యాసాలు అనగా మనందరం మామూలుగా చదవగలిగే సమాచారం ఉన్న పేజీలు.  ఇలాంటి వ్యాసాలకు సహాయంగా, బొమ్మలు, వర్గీకరణ పేజీలు, మూసలు (టెంప్లేటులు), వ్యాసంలో ఉన్న సమాచారంపై చర్చా పేజీలు, సభ్యుల పేజీలు, సహాయ పేజీలు, మొదలయిన పేజీలు ఇంకా చాలా ఉంటాయి. ఈ పేజీలు వ్యాసాలను మొత్తంగా కలిపేస్తే పేజీల సంఖ్య వస్తుంది.

ఇతర బారతీయ వికీపీడియాలు ఎక్కడ ఉన్నాయి?
బెంగాలీ వికీపీడియాకు 59 వేల పేజీలున్నాయి.  దాని తరువాత పేజీల సంఖ్యలో తెవికీ నిలుస్తుంది. ఇంకో నెలా రెండు నెలలలో మనం దానిని దాటేస్తాములేండి. మన తరువాతి స్థానంలో తమిళ వికీపీడియా, బిష్నుప్రియా మనిపూరి వికీపీడియా 25 వేల పేజీలతో పోటీ పడుతున్నాయి.

ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1000-2000 మంచి వ్యాసాలు ఉన్నాయి.  వీటి నుండి ప్రతీవారం ఒక వ్యాసాన్ని ఎంచుకుని తెవికీ మొదటి పేజీలో ప్రదర్శిస్తున్నారు. ముందు ముందు దీనిని ప్రతీ రోజు ఒక మంచి వ్యాసం ప్రదర్శనగా చేస్తారేమో.  అయితే ప్రస్తుతం ఈ వ్యాసాలను మీకు email ద్వారా అందించే ప్రయత్నం కూడా జరుగుతుంది. కావలిసిన వారికే అలా వారానికి ఒక వ్యాసం పంపించే ఏర్పాట్లు ప్రస్తుతం ఇంకా పూర్తవలేదు. అది పూర్తయ్యే వరకు నేనే ప్రతీ వారం ఒక మెయిలు పంపిస్తాను. ఎవరికయినా అబ్యంతరాలుంటే తెలుపగలరు.

ప్రతీ వారం తెవికీ మొదటి పేజీలో ప్రదర్శింపబడే వ్యాసాం సంక్షిప్తంగా ఈ పేజీలో ఉంటుంది. ఈ లింకును మీరు మీ బ్లాగులో కూడా పెటుకోవచ్చు. ఈ పేజీలో ఉన్న సమాచారం వారం వారం మారుతూ ఉంటుంది. ప్రతీ వారం ఒక కొత్త వ్యాసపు సంక్షిప్త సమాచారంతో ఈ పేజీ ఎప్పటి కప్పుడు తాజాగా ఉంటుంది.

--
మాకినేని ప్రదీపు